తెలంగాణ ఉద్యమ నాయకుడు మాజీ జెడ్పిటిసి రమణారెడ్డి…
కమాన్ పూర్, (సిరా న్యూస్);
అధికార పార్టీలో ఇముడా లేకనే బి ఆర్ ఎస్ పార్టీ నుండి బయటకి రావడం జరిగిందని ఉమ్మడి కమాన్ పూర్ మండల మాజీ జెడ్పిటిసి ఉద్యమకారుడు రామగిరి మండల కల్వచర్ల ప్రస్తుత సర్పంచ్ గంట పద్మ భర్త గంట వెంకటరమణారెడ్డి ఆవేదన వ్యక్తం చేసి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. తనతోపాటు కల్వచర్ల సర్పంచ్ గంట పద్మ కాంగ్రెస్ పార్టీలో చేరారని పేర్కొన్నారు. తాను తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్నో ఆటుపోట్లకు గురవడం జరిగిందని అన్నారు. పోలీసులు ఎన్నోమార్లు దాడి చేయడం జరిగిందని వారి దెబ్బలు కూడా తినడం జరిగిందని అన్నారు. బి ఆర్ ఎస్ పార్టీలో కమాన్ పూర్ మండల అధ్యక్షునిగా చేశానని ఎన్నో మార్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడంతో కేసులు నమోదు అయ్యాయని. పేర్కొన్నారు. తనకు ఎంపీపీ పదవి వస్తే ఎదిగిపోతానని భయంతో తనను కమాన్ పూర్ ఎంపీపీగా కాకుండా చేసిన ఘనత అధికార పార్టీ నాయకులదేనని ఆరోపించారు. అలాగే కమాన్ పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి జనరల్ మహిళలకు కేటాయించిన సమయంలో తనకు కాకుండా వేరే వారికి ఇవ్వడం జరిగిందని స్పష్టం చేశారు. ప్రస్తుత బిజెపిలో ఉన్న సునీల్ రెడ్డితో తాము ఎన్నో తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొనడం జరిగిందని అప్పుడు ఉద్యమ నాయకుడు సునీల్ రెడ్డి కాకుండా ఎమ్మెల్యే టికెట్ పుట్ట మధుకు ఇవ్వడం సరైనది కాదని అన్నారు. నాకు ఎంపీపీ పదివేస్తే ఎదిగిపోతానని నెపంతో తనను అనగదొక్కడానికే యత్నాలు చేశారని అన్నారు. దీంతో 2018 ఎన్నికల్లో అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో చేరి శ్రీధర్ బాబు విజయంలో కీలకపాత్ర వహించడం జరిగిందని అన్నారు. మళ్లీ బి ఆర్ ఎస్ అధిష్టానం నాయకులు తనకు సముచిత స్థానం కల్పిస్తామని వారి పిలుపుమేరకు బి.ఆర్.ఎస్ పార్టీలో చేరానని కానీ తనకు ఎటువంటి న్యాయం జరగలేదని దీంతో మనస్థాపానికి గురై కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని శ్రీధర్ బాబు గెలుపునకు నా వంతుగా సాయి శక్తుల కృషి చేస్తానని అన్నారు