సిరా న్యూస్,కత్బుల్లాపూర్;
హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు శరవేగంగా జరుగుతున్నాయి. .దుండిగల్ మున్సిపాలిటీ పరిదిలోని కత్వ చెరువులో 170/1సర్వే నెంబర్ లో వెలిసిన ఎనిమిది విల్లాలను నేలమట్టం చేస్తున్నారు హైడ్రా అధికారులు. మల్లంపేట్ కత్వ చెరువు ఎఫ్టిఎల్ విస్తీర్ణం 142 ఎకరాలు. మల్లంపేట్ లో లక్ష్మీ శ్రీనివాస కన్ స్ట్రక్షన్స్ పేరుతో 2020-21 సంవత్సరానికే 320విల్లాస్ లను నిర్మించిది ఈ సంస్థ..అప్పటికే 60విల్లాలకు మాత్రమే హెచ్ఎండీయే పర్మిషన్ తీసుకున్న ఈ సంస్థ మిగతావన్నింటిని ఫోర్జరీ పర్మిషన్ తో కన్స్ట్రక్షన్ చేసిందన్న ఆరోపణలతో అప్పటి మేడ్చల్ కలెక్టర్ హరీష్ నేతృత్వంలో డిపిఓ ఆద్వర్యంలో ఎంక్వైరీ చేసి 208విల్లాలకు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని నోటీసులు జారీచేసారు. సీజ్ చేశారు..హైకోర్ట్ ఆదేశాలతో ఈ అక్రమవిల్లాలకు కరెంట్ కనెక్షన్, వాటర్ కనెక్షన్,రిజిస్ట్రేషన్ లను ఆపాలని,బ్యాంక్ అధికారులు లోన్ లను నిలిపివెయ్యాలని ఆర్డినెన్స్ జారీచేశారు..చట్టంలో ఉన్న లొసుగులతో దుండిగల్ మున్సిపాలిటీ అధికారుల సహకారంతో అక్రమ విల్లాలన్ని సక్రమవిల్లాలుగామారిపోయాయి.