సిరా న్యూస్,మిర్యాలగూడ;
నల్గొండ జిల్లా మిర్యాలగూడ అద్దంకి నార్కట్ పల్లి బైపాస్ మిర్యాలగూడ కు చెందిన విఎన్ఆర్ కంపెనీకి సంబంధించిన మినీ బొలెరో పాల వ్యాను కావలి నుండి నార్కట్ పల్లి వెళుతున్న క్రమంలో నందిపాడు రోడ్డు లోని ఓ ఆటోను ఓవర్టేక్ చేయబోయిన క్రమంలో అదుపుతప్పి కింద పడింది. ప్రమాదవశాత్తు ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. కానీ పాల వ్యాను కింద పడిపోవడంతో వ్యాన్ లోని పాలు నేల పాలు అవుతున్న క్రమంలో ప్రజలు తండోపతండాలుగా ఎగబడి ఎవరికి కావాల్సినంతగా వాళ్ళు బాటిల్లు బకెట్లలో పాల ను తీసుకెళ్లడంతో అక్కడున్న వారికి ఆశ్చర్యాన్ని గురిచేసింది. సమాచారం తెలుసుకున్న పట్టణ టు టౌన్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొనీ జెసిబి సహాయంతో వ్యాను ను పక్కకు పెట్టి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా క్లియర్ చేశారు.