
అయ్యా.. నో… ఎస్ లు…
సిరా న్యూస్,విజయవాడ; ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు చాలా గుంభనంగా అసలేమీ తెలియనట్లు ఉంటారు వారు ప్రత్యక్షంగా ప్రజలలోకి రారు. సర్వేలు చేయరు. విశ్లేషణలు చెప్పరు.. కానీ, రాజకీయ క్షేతంలో ఎక్కడెక్కడఏమేం జరుగుతోందో ఇట్టే పట్టేస్తారు. పసిగట్టేస్తారు. రాజకీయలతో అసలు ఏమాత్రం సంబంధం లేనట్లుండే వీరు ఆ రాజకీయ పరదాల చాటున ఏం జరుగుతుందో కళ్ళు మూసుకుని కూడా చూసేయగలరు. అందుకు తగ్గట్టుగా తమ స్ట్రాటజీలు మార్చుకుంటారు. ఇప్పడు ఏపీలో అదే జరుగుతోంది. ప్రభుత్వ ఉన్నతాధికారులు వరసగా క్యూ కట్టి మరీ రహస్యంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలుస్తున్నారు. అంటే మాజీ ముఖ్యమంత్రి మళ్ళీ ముఖ్యమంత్రి కావడం ఖాయమనే నిజాన్ని అధికారులు ఇప్పటికే.. ఇప్పటికే ఏమిటి ఎప్పుడో పసిగట్టారు. అందుకే, అలా ఒకరివెంట ఒకరుగా ఐఏఎస్, ఐపీఎస్‌లు ఏదో విధంగా చంద్రబాబును కలుసుకునేందుకు తహతహలాడుతున్నారు. నిజానికి, ఉమ్మడి…
