Telugu Online News Daily
https://siranews.in/
https://siranews.in/
Date of Publish : 29 November 2023, 1:13 pmEditor : SIRA NEWS
ఆదిలాబాద్ ను కమ్మేసిన పొగ మంచు…

సిరా న్యూస్, ఆదిలాబాద్:
అడవుల జిల్లా ఆదిలాబాద్ ను పొగ మంచు కమ్మేసింది. చలికాలం ప్రారంభం కావడంతో ఉదయం ఎటు చూసినా పొగ మంచు కనిపిస్తోంది. 44 వ నంబరు జాతీయ రహదారిపై పొగ మంచు భారీగా కమ్ముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం పూట సైతం వాహనాల లైట్లు వేసి ప్రయాణాలు చేస్తున్నారు. పక్కనున్న వాహనాలు సైతం కనిపించనంత పొగ మంచు కురుస్తుండడంతో లైట్లు వేసిన లేకపోవడంతో వాహన చోదకులు అవస్థలు పడుతున్నారు.
