
ఆర్థిక లోసుగులు పైనే దృష్టి
సిరా న్యూస్,హైదరాబాద్; తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ కొలువుదీరిన మొదటి రోజు నుంచే గత ప్రభుత్వ వైఫల్యాలపై దూకుడుగా వెళ్తోంది. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ముందు లోక్ సభ ఎన్నికలు ఛాలెంజ్‌గా మారాయి. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలకు చెక్ పెట్టాలంటే తామిచ్చిన హామీలను అమలు చేయడం చాలా కీలకమైన అంశం. ఈ నేపథ్యంలో సీఎంతో మాజీ ఆర్బీఐ గవర్నర్ భేటీ కావడం పొలిటికల్ ఇంట్రెస్టింగ్ గా మారింది. అయితే ఆర్థిక రంగంలో అంతర్జాతీయ స్థాయిలో విశేష అనుభవం కలిగిన రఘురామ్ రాజన్ గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీకి టచ్‌లో ఉంటున్నారు.రాష్ట్ర ప్రగతిలో భాగంగా పలు రంగాల్లో తిరుగులేని పురోగతి సాధించామంటూ బీఆర్ఎస్ ఇన్నాళ్లు ప్రజలను అబద్ధాలతో మభ్యపెట్టిందని అధికార పక్షం వాదిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై…
