
ఇక ప్రలోభాలకు తెర
సిరా న్యూస్,హైదరాబాద్; నెల రోజుల పాటు ప్రచారంతో హోరెత్తిన వీధులు నిశబ్దంగా మారిపోయాయి. తెలంగాణ ఓటర్లు గురువారం ఓటు వేయడానికి సిద్ధమయ్యారు. నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. 119 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుండగా.. 13 నియోజకవర్గాల్లో సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్ ముగియనుంది. సిర్పూర్, బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలంలో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసింది. భద్రత పరంగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్ 3న తెలంగాణ ఎన్నికల ఫలితాలు రానున్నాయి.తెలంగాణ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగింది బీజేపీ నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు నడ్డా, మంత్రులు ప్రచారం చేశారు. ఇక రాష్ట్రం…
