
ఉద్యమాల ద్రోహికి తగిన గుణపాఠం చెప్పండి
బిసిలకు, ఎస్సీలకు, మహిళలకు, జర్నలిస్టులకు అన్యాయం చేసిన డా.సంజయ్ కుమార్ యావర్ రోడ్డు విస్తరణలో అన్నీ అక్రమాలే పాత్రికేయుల సంక్షేమం మరిచి సొంత పార్టీకి "గడి నిర్మించుకున్న" దొర ఉచిత కంటి ఆపరేషన్ల కు ఆధార్ కార్డు లెందుకు..? సిరా న్యూస్,జగిత్యాల; తెలంగాణ ఉద్యమాల సమయంలో ఎక్కడా కానరాని ఉద్యమాల ద్రోహి డాక్టర్ సంజయ్ కుమార్ కు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని ఉద్యమ కారుడు, తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి పిలుపునిచ్చారు. మంగళ వారం ఆయన ఒక ప్రకటన జారీ చేశారు. ఎంతో మంది ప్రాణాలు అర్పించి, సకల జనులు రోడ్డెక్కిన తెలంగాణ ఉద్యమాలలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఏనాడూ కనిపించిన దాఖలాలు లేవన్నారు. అంతే కాకుండా భారత రాజ్యాంగ పరంగా కల్పించబడిన మహిళల,…
