
కాంగ్రెస్ …. ఆశలు ఫలించేనా…
సిరా న్యూస్,హైదరాబాద్; తెలంగాణఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈసారి హై హోప్స్ పెట్టుకుంది. మూడు నెలల క్రితం వరకూ కొంత స్తబ్దుగా ఉన్న పార్టీ ఒక్కసారిగా ముందుకు వచ్చింది. పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే కొనసాగేలా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంది తెలంగాణ అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకూ ఆచితూచి అడుగులు వేసింది. అసంతృప్తులు అక్కడక్కడా కనిపించినా.. కీలక నేతలు బయటకు వెళ్లిపోయినా టిక్కెట్లను కొంత ఆలస్యంగానే ఖరారు చేసింది. విడతల వారీగా టిక్కెట్ల జాబితాను విడుదల చేసి జనంలోకి వెళ్లేలా ప్లాన్ చేసుకుంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు కూడా టిక్కెట్లు ఇస్తూ ఆర్థికంగా, సామాజికపరంగా బలమైన నేతలను గుర్తించి టిక్కెట్లను కేటాయించింది.టిక్కెట్ల కేటాయింపులో అలకలు.. అసంతృప్తులు పార్టీలో కొంత సహజమే అయినప్పటికీ అవి పెద్దగా ఈసారి ప్రభావం చూపలేదు. అధికార పార్టీపై ఉన్న అసంతృప్తిని…
