
కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా విపక్షాల అడుగులు
సిరా న్యూస్,హైదరాబాద్; తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త సెక్రటేరియట్ లో మంత్రివర్గం సమావేశం నిర్వహించారు. సోనియాగాంధీ పుట్టినరోజు సందర్భంగా డిసెంబరు 9 నుంచి రెండు గ్యారంటీలను అమలు చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరక ముందే విపక్ష నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు ప్రభుత్వంపై కామెంట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగదని, ఆరు నెలల్లోనే కూలిపోతుందని జోస్యం చెబుతున్నారు. ఏడాది ఓపిక పట్టాలని కడియం శ్రీహరి అంటే, కాంగ్రెస్ నేతల నుంచి ఫోన్లు వస్తున్నాయంటూ మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అయితే ఆరు నెలల్లో ప్రభుత్వం కూలిపోతుందని అన్నారు. చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చుట్టూ ఉచ్చు బిగిస్తున్నారా ? లేదంటే తమ ఎమ్మెల్యేలను చేర్చుకోండి చూద్దామంటూ ఉసి…
