ఆంధ్రప్రదేశ్

కాలిబాట మార్గం గుండా తిరుమలకు చేరుకున్న నటి దీపికా పదుకుణే.

సిరా న్యూస్,తిరుమల; తిరుమల శ్రీవారి దర్శనార్ధం ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకుణే తిరుమలకు చేరుకున్నారు.. గురువారం రాత్రి అలిపిరి కాలిబాట మార్గం గుండా గోవింద నామ స్మరణ చేస్తూ సామాన్య భక్తులతో కలిసి ముడున్నర గంట పాటు నడుచుకుంటూ బాలీవుడ్ నటి దీపికా పదుకుణే తిరుమలకు చేరుకున్నారు. నడక మార్గంలో నడుచుకుంటూ వస్తున్న దీపికా పదుకుణేతో భక్తులు సెల్పీలు దిగేందుకు ఉత్సాహం చూపించారు.. అనంతరం తిరుమలలోని రాధేయం అతిధి గృహం చేరుకున్న దీపికా పదుకుణే, ఇవాళ రాత్రి తిరుమలలో బస చేసి, శుక్రవారం ఉదయం స్వామి వారి సుప్రభాత సేవలో, విఐపి విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకున్నారు..

Read More
15 Dec 2023, 8:45 pmsiranews.in