
కేటీఆర్ పై కేసు
సిరా న్యూస్,వరంగల్; కొన్ని వారాలుగా బీఆర్‌ఎస్ నాయకులు న్యాయపరమైన చిక్కుల్లో పడుతున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితను మార్చి 16న ఈడీ అరెస్టు చేసింది. పది రోజుల కస్టడీ తర్వాత తిహార్ జైలుకు తరలించింది. తర్వాత బీఆర్‌ఎస్ రాజ్యసభ ఎంపీ కేసీఆర్ మేనల్లుడు జోగినపల్లి సంతోష్‌రావుపైనా భూ ఆక్రమణ కేసు నమోదైంది. హైదరాబాద్‌లో అక్రమంగా భూమి కబ్జా చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారని అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేశారు. తాజాగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ తనయుడు కేటీఆర్‌పైనా కేసు నమోదైంది.ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కించపరిచేలా కేటీఆర్ వ్యాఖ్యలు చేశారని పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాస్‌రావు హనుమకొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లు మంత్రులు ఎక్కడికి వెళ్లినా విపక్షాలను అరెస్టు చేసేశారు. నిర్భందించేవారు. అక్రమంగా కేసులు…
