
కోట్లు కురిపించిన ఎన్నికలు
సిరా న్యూస్,హైదరాబాద్; తెలంగాణ ఎన్నికల ప్రచారంలో డిజిటల్ మీడియాను భారీగా వాడుకున్నారు. ప్రతి ఒక్క అభ్యర్థి సోషల్ మీడియాతో ప్రజల్లోకి వెళ్లారు. అంతో కాకుండా ఫేస్ బుక్, గూగుల్ కూడా పార్టీలు భారీగా ప్రకటనలు ఇచ్చాయి. వందల కోట్ల రూపాయలను ప్రకటనల కోసమే ఉపయోగించాయి. దీంతో గూగుల్, ఫేస్ బుక్ పై కాసుల వర్షం కురిసింది. దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల ఎన్నికలతోపాటు.. ఈ ఏడాది రాజకీయ పార్టీలు గూగుల్, ఫేస్ బుక్ లకు అక్షరాల 450 కోట్ల రూపాయల యాడ్స్ వచ్చినట్లు చెబుతున్నారు. నవంబర్ 1వ తేదీ నుంచి నవంబర్ 28వ తేదీ ప్రచారం ముగిసేంత వరకు.. అధికారికంగా.. నేరుగా గూగుల్, ఫేస్ బుక్ లకు అన్ని పార్టీలు కలిపి 25 కోట్ల రూపాయల యాడ్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో గూగుల్ వాటా 20 కోట్లుగా…
