
కోర్టు ధిక్కరణ ఐఏఎస్ లకు జైలు శిక్ష
సిరా న్యూస్,విజయవాడ; కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని ఇద్దరు ఐఏఎస్‌లకు నెల రోజుల జైలు శిక్ష విధిస్తూ ఏపీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఐఏఎస్ అధికారులు జె. శ్యామలరావు, పోలా భాస్కర్‌కు జైలు శిక్ష విధించింది. ఇద్దరు ఐఏఎస్‌లకు రూ. వెయ్యి చొప్పున జరిమానా కూడా విధించారు. నీరు-చెట్టు అంశంపై హైకోర్టు ఆదేశాలను ధిక్కరించారని హైకోర్టు తేల్చింది. వచ్చే నెల 8లోపు రిజిస్ట్రార్ జ్యుడీషియల్ వద్ద లొంగిపోవాలని హైకోర్టు ఆదేశించింది. 2019 ముందు రాష్ట్రంలో జరిగిన నీరు-చెట్టు పనుల బిల్లులు కూడా ఇప్పటికీ చెల్లించలేదు. అవన్నీ చాలావరకు చిన్న మొత్తాలే. వీరంతా కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశించినా బిల్లులు చెల్లించకపోవడంతో కోర్టు ధిక్కరణ కేసులూ నమోదయ్యాయి. ఈ ధిక్కరణ కేసులకు సంబంధించినవే ఇంకా రూ.270 కోట్ల మేర చెల్లించాల్సి ఉంది. ఇవికాక మరో రూ.400 కోట్లకు పైగా…
