
క్రాస్ రోడ్స్ లో భూమా వారసులు
సిరా న్యూస్,కర్నూలు; వారసత్వ రాజకీయాలను కొనసాగించడం అంత సులువు కాదు. ప్రతి ఒక్కరికీ సాధ్యపడదు. కొందరే అందులో వారసత్వాన్ని అందిపుచ్చుకుంటారు. మరికొందరు మాత్రం వారసత్వ రాజకీయాలను కొనసాగించలేక చతికిలపడతారు. నంద్యాలలో భూమా కుటుంబం ఇదే పరిస్థితిని ఎదుర్కొంటుంది. నంద్యాలలో ఒకప్పుడు భూమా నాగిరెడ్డి అంటే తిరుగులేదు. ఇటు నంద్యాల, అటు ఆళ్లగడ్డ రెండు నియోజకవర్గాల్లోనూ ఆ కుటుంబానిదే పై చేయి. నంద్యాలను భూమా నాగిరెడ్డి, ఆళ్లగడ్డలో భూమా శోభానాగిరెడ్డిలు తమ అడ్డాగా చేసుకుని ఎన్నికయ్యారు. పార్టీ ఏది అన్నది కాదు కేవలం వ్యక్తిగత ఇమేజ్ తోనే వారు రాజకీయంగా రాణించగలిగారు. అయితే ఇద్దరి హఠాన్మరణంతో ఆ కుటుంబంలో వారసులు మాత్రం అంత రాణించలేకపోయారు. ఆళ్లగడ్డలో భూమా శోభానాగిరెడ్డి ప్రమాద వశాత్తూ మరణించడంతో ఆమె స్థానంలో కుమార్తె భూమా అఖిలప్రియ ఉప ఎన్నికల్లో ఏకగ్రీవమయ్యారు. తర్వాత చంద్రబాబు మంత్రివర్గంలో…
