తాజా వార్తలు

గ్రామాల్లో తాగు నీటి సమస్యలు లేకుండా చూడాలి..

సిరా న్యూస్, పెంబి: గ్రామాల్లో తాగు నీటి సమస్యలు లేకుండా చూడాలి.. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్.. గ్రామీణ ప్రాంతాలలో తాగు నీరు సమస్యలు లేకుండా చూడాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో  సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. ఈ  సందర్బంగా మాట్లాడుతూ గ్రామాల్లో నీటి సమస్యలు లేకుండా అధికారులు తగు చర్యలు తీసుకోవాలన్నారు. పదవ తరగతి పరీక్షలలో విద్యార్థులకు మంచి ఫలితాలు వచ్చేలాగా చూడాలని అధికారులకు సూచించారు. అభివృద్ధి పనులకు ప్రతి ఒక్కరూ సహాకరించాలని పేర్కొన్నారు. ప్రతి గ్రామానికి త్రీ ఫేజ్ కరెంట్ సౌకర్యం కల్పించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఉపాధి పనులు  ద్వారా కూలిలకు పని కల్పించే విధంగా చూడాలని తెలిపారు. దొంతి వాగు సమస్యపై అధికారులతో మాట్లాడుతానని అన్నారు.…

Read More
5 Mar 2024, 8:10 pmsiranews.in