
చిరంజీవిపై మన్సూర్ ఆలీఖాన్ ..తీవ్ర ఆరోపణలు
సిరా న్యూస్,చెన్నై; సౌత్ స్టార్ హీరోయిన్ త్రిషపై తమిళ నటుడు మన్సూర్ అలీ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆయన కామెంట్స్ పై పలువురు ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. త్రిషకు మద్దతుగా 'లియో' దర్శకుడు లోకేష్ కనగరాజ్, మెగాస్టార్ చిరంజీవి, యువ హీరో నితిన్, నటి ఖుష్బూ, హీరోయిన్ మాళవికా మోహనన్ సహా పలువురు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. జాతీయ మహిళా కమిషన్ కూడా సీరియస్ అయ్యింది. తమిళ పోలీసులు ఆయనపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. చివరకు మన్సూర్ త్రిషకు క్షమాపణ చెప్పడంతో వివాదం సర్దుమణిగింది.మరోవైపు త్రిషపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో తనపై మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలను మన్సూర్ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ మేరకు ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తనను వక్రబుద్ధి…
