తాజా వార్తలు

జనసేన గూటికి చంద్రశేఖర్…

సిరా న్యూస్;విజయవాడ; ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. జంపింగ్ లు ఊపందుకుంటున్నాయి. నాయకులు తమ రాజకీయ భవిష్యత్తును వెతుక్కుంటూ వివిధ పార్టీల్లో చేరుతున్నారు. తాజాగా భారత రాష్ట్ర సమితి ఏపీ శాఖ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో కెసిఆర్ ఓటమి చవిచూడడం.. జాతీయ పార్టీ విస్తరణ అంశం పక్కకు వెళ్లడం.. బిఆర్ఎస్ తెలంగాణకే పరిమితం కావడం వంటివి చంద్రశేఖర్ పార్టీ మారేందుకు కారణమని తెలుస్తోంది. ఇప్పటికే మాజీమంత్రి రావెల కిషోర్ బాబు వైసీపీలో చేరారు. దీంతో తోట చంద్రశేఖర్ సీరియస్ గా ఆలోచిస్తున్నారు.తెలంగాణలో కేసీఆర్ ఓటమితో భారత రాష్ట్ర సమితి విస్తరణ మరుగున పడిపోయింది. కెసిఆర్ పిలుపుమేరకు తోట చంద్రశేఖర్ జనసేనను వీడి బిఆర్ఎస్ లో చేరారు. ఉభయగోదావరి జిల్లాల్లో ఏదో ఒకచోట పోటీ చేయాలని భావించారు.…

Read More
3 Feb 2024, 11:33 amsiranews.in