Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 2 July 2024, 1:46 pmEditor : Sira News

తాడేపల్లిలో జగన్ నివాసం దగ్గర అడ్డంకులు తొలగింపు

 సిరా న్యూస్,తాడేపల్లి;
రాష్ట్రంలో . ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడ్డాక జగన్ నివాసం మార్గంలోని అడ్డంకులను ఒక్కొక్కటిగా తొలగిస్తున్నారు. జగన్ ప్రస్తుతం ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి కావడంతో ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసిన భద్రత టెంట్లను సోమవారం రాత్రి తొలగించారు, ఆయన నివాసానికి వెళ్లే నాలుగు లైన్ల రహదారిలో గతంలో అత్యంత ఆధునిక సామగ్రితో భద్రతా ఏర్పాటు చేశారు.
ఇప్పుడు జగన్ నివాసానికి వెళ్లే నాలుగు లైన్ల రహదారిలో రాకపోకలు మరింత సుగమమయ్యేలా చర్యలు చేపట్టారు. వాహనాలను నిలిపి వేయకుండా వెళ్తే కట్టడి చేసే టైర్ కిల్లర్లు (మేకులతో కూడిన బారికేడ్లు), హైడ్రాలిక్ బుల్లెట్లను క్రేన్ సాయంతో తీసివేశారు. ఇవన్నీ విద్యుత్తో పని చేస్తాయి. వీటితో పాటు రోడ్డుపై వేసిన రెయిన్ ప్రూఫ్ టెంట్లు, ఆంధ్రరత్న పంపింగ్ స్కీం వైపున ఉన్న పోలీసు చెక్ పోస్టును సైతం ఎత్తివేశారు. తొలగించిన సామగ్రిని లారీలో తరలించారు. రహదారి వెంట కంటైనర్లు మాత్రం అలాగే ఉన్నాయి.
ఇంతకు ముందే నాలుగు లేన్ల రహదారి మంగళగిరి – తాడేపల్లి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.
=====

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.