
నీటి ఎద్దడి నివారణ ముందస్తు చర్యలు చేపట్టాలి. –జెడ్పీ ఫ్లోర్ లీడర్ గీకురు రవీందర్.
సిరా న్యూస్, చిగురు మామిడి: నీటి ఎద్దడి నివారణ ముందస్తు చర్యలు చేపట్టాలి. --జెడ్పీ ఫ్లోర్ లీడర్ గీకురు రవీందర్. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ముందస్తు నీటి ఎద్దడి నివారణ చర్యలు చేపట్టాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి బాస మధుసూదన్ ను స్థానిక జడ్పిటిసి సభ్యులు గీకురు రవీందర్ కోరారు. తాగునీటి సమస్య నివారణ చర్యల నిమిత్తం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు జడ్పిటిసి సభ్యులు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిడిఓ తో సమావేశమై నీటి సమస్యపై చర్చించారు. మండల ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లోనూ త్రాగునీటి సమస్యలు రావద్దని, ఆయా గ్రామాల్లో ముందస్తుగానే సమస్యలను గుర్తించాలన్నారు. మిషన్ భగీరథ, గ్రామీణ నీటి పారుదల శాఖా అధికారులు నీటి…
