Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 1 December 2023, 11:58 amEditor : Sira News

నేడు జాతీయ కాలుష్య నివారణ దినోత్సవం

సిరా న్యూస్;

నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే అంటే జాతీయ కాలుష్య నివారణ దినోత్సవం అన్నమాట. ప్రతీ ఏడాది డిసెంబర్ 2 వ తేదీన ఈ నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే జరుపుకుంటారు. ఈ ఏడాది జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవానికి  ఉన్న ప్రత్యేకత, ప్రాధాన్యత, చరిత్ర నేపథ్యం ఏంటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.  భోపాల్ గ్యాస్ దుర్ఘటన గురించి అందరికీ తెలిసిందే. 1984లో డిసెంబర్ 2, 3 తేదీల్లో రాత్రి జరిగిన ఈ ఘోర దుర్ఘటనలో చనిపోయిన వారిని స్మరించుకుంటూ ప్రతీ ఏడాది అదే తేదీ అయిన డిసెంబర్ 2 న జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్ కెమికల్ ఫ్యాక్టరీ నుంచి మిథైల్ ఐసోసైనేట్  అనే విష రసాయనాలు లీకైన కారణంగా ఈ ఘటన చోటుచేసుకుంది. జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం లక్ష్యం:ప్రతీ ఏడాది కాలుష్యంతో ప్రపంచ మానవాళికి జరిగే నష్టాన్ని తెలియజెప్పేందుకే నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డేను నిర్వహిస్తున్నారు. జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవాన్ని నిర్వహించడం వెనుకున్న మరో లక్ష్యం ఏంటంటే.. పౌరులు కాలుష్యానికి వ్యతిరేకంగా పోరాడేలా వారికి అవగాహన కల్పించడమే. జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవానికి ముందుగా సెంట్రల్ పొల్యుషన్ కంట్రోల్ బోర్డు  కాలుష్యంపై పలు గణాంకాలు విడుదల చేసింది. ఈ ఏడాది నవంబర్‌లో ఢిల్లీలో జరిగినంత గాలి కలుషితం గత ఏడు సంవత్సరాల్లో ఎన్నడూ జరగలేదని జాతీయ కాలుష్య నివారణ మండలి పేర్కొంది.

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.