
పాలేరులో శ్రీ మంతుల పోటీ
సిరా న్యూస్,ఖమ్మం; తెలంగాణ ఎన్నికలకు ఇంకా రెండు రోజులు మాత్రమే సమయం ఉంది. అయితే బిగ్ ఫైట్ అనేక చోట్ల జరుగుతున్నా ప్రతిష్టాత్మకమైన పోరు పాలేరు నియోజకవర్గంలో జరుగుతుంది. ఇక్కడ మిలియనీర్లు పోటీ పడుతుండటమే. కరెన్సీ కట్టలు కట్టలుగా బయట పడుతున్నాయి. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఇద్దరు అభ్యర్థులు శ్రీమంతులే. ఈ ఎన్నికల్లో గెలుపును వారు సీరియస్ గా తీసుకున్నారు. ఇద్దరూ పార్టీలు మారిన వాళ్లే. ఇద్దరూ ఒకే సామాజికవర్గానికి చెందిన వారే. కానీ పోటీ మాత్రం సూపర్. అక్కడ సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కూడా పోటీ చేస్తున్నారు. ఆయన ఎవరి ఓటు చీలుస్తారన్న టెన్షన్ ఇప్పుడు ఇరు పార్టీల నేతలకు పట్టుకుంది. రాష్ట్రమంతటా పాలేరు వైపు చూస్తుంది.పాలేరులో పోటీ మామూలుగా లేదు. బీఆర్ఎస్ అభ్యర్థిగా కందాల ఉపేందర్ రెడ్డి బరిలో ఉన్నారు.…
