
బిగ్ బాస్ శివాజీకి అమరావతి లింక్…
సిరా న్యూస్,విజయవాడ; బిగ్ బాస్ సీజన్ 7లో ఫైనల్స్ దగ్గర పడుతున్నాయి. దీంతో హౌజ్‌లో కంటెస్టెంట్స్ ఎంత అలర్ట్‌గా ఉంటారో.. బయట వారికి ఓటు వేసేవారు కూడా అంతే అలర్ట్‌గా ఉండాలి. బిగ్ బాస్ ప్రేక్షకులు వేసే ఓట్లు.. కంటెస్టెంట్స్‌ను నామినేషన్స్ నుంచి తప్పించడానికి ఎంత ఉపయోగపడతాయో.. వారిని ఫైనల్స్ తీసుకెళ్లడానికి కూడా అంతే ఉపయోగపడతాయి. అందుకే బయట ఉన్న శివాజీ టీమ్ అలర్ట్ అయ్యారు. మామూలుగా తమ కంటెస్టెంట్‌ను సపోర్ట్ చేయడం, వారు ఏం చేసినా కరెక్ట్ అని చెప్పడం, ఓట్లు వేయమని అడగడం మాత్రమే పీఆర్ టీమ్స్ లక్ష్యం. కానీ శివాజీ టీమ్ మాత్రం దీనికి మరింత కొత్తదనాన్ని యాడ్ చేసింది.బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభమయినప్పటి నుంచే శివాజీ మీద ప్రేక్షకుల్లో పాజిటివ్ అభిప్రాయం ఏర్పడింది. మిగతావారంతా తమకు ఇచ్చిన టాస్క్‌ను రూల్…
