
బీఆర్ఎస్ వలె పీఆర్సీ ఇవ్వాలి
సిరా న్యూస్,కోరుట్ల; గత బీఆర్ఎస్ ప్రభుత్వం వలెనే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులకు,పెన్షనర్లకు 43 శాతం పీఆర్సీ ఇవ్వాలని తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ కోరుట్ల డివిజన్ అధ్యక్షుడు పబ్బా శివానందం కోరారు.సోమవారం తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అస్సోసియేషన్ కోరుట్ల డివిజన్ శాఖ ఆధ్వర్యంలో జాతీయ పెన్షనర్స్ దినోత్సవం పక్షోత్సావాలు(17 డిసెంబర్ 2023 నుండి 02 జనవరి 2024 )సందర్భంగా డిమాండ్ల దినం నిర్వహించారు.ఈ సందర్భంగా శివానందం మాట్లాడుతూ మా రాష్ట్ర అధ్యక్షుడు గాజుల నర్సయ్య,జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో సమస్యల సాధనకు రాజీ లేని పోరాటం చేస్తామన్నారు. గత ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తమకు అన్ని విధాలా సహకరించిననందుకు కృతజ్ఞతలు తెలుపు తున్నామని,ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తమకు అండగా ఉంటామని నిన్న జరిగిన జాతీయ పెన్షనర్స్ దినోత్సవం లో తెలిపి…
