Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 28 November 2023, 8:31 pmEditor : Sira News

విశ్వాస ఘాతకుడు రెడ్యానాయక్‌

కాంగ్రె్‌సలో పదవులు అనుభవించి, గుండెలపై తన్నాడు..
ఆయన కుటుంబ దందాలకు ఓటుతో సమాధానం చెప్పాలి…
మరిపెడ బహిరంగ సభలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి
సిరా న్యూస్,మహబూబాబాద్‌;

సర్పంచ్‌ నుంచి మంత్రి వరకు కాంగ్రెస్‌ ద్వారానే అనేక పదవులు అనుభవించి, స్వార్థ రాజకీయాల కోసం బీఆర్‌ఎస్‌ దొరల పంచన చేరిన డీఎస్‌ రెడ్యానాయక్‌ కుటుంబ దందాలకు కాంగ్రెస్‌ ఓటుతో సమాధానం చెప్పాలని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. డోర్నకల్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి డాక్టర్‌ జాటోతు రాంచంద్రునాయక్‌ విజయభేరి సభ ను మహబూబాబాద్‌ జిల్లా మరిపెడలో డీసీసీ అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్‌చందర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ చిన్న ఉ ద్యోగం కోసం సీనియర్‌ నేత రామసహాయం సురేందర్‌రెడ్డి వద్దకు వెళ్లిన రెడ్యానాయక్‌కు సర్పంచ్‌, సమితి ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే, మంత్రి పదవులతో పాటు ఆ యన కూతురుకు కూడా పక్క నియోజకవర్గంలో ఎ మ్మెల్యేను చేస్తే కాంగ్రెస్‌ గుండెల మీద తన్ని దొరల పంచన చేరడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. రెడ్యా కొడుకు బియ్యం దందా, భార్య ఇసుక దందా, కూతురు కమీషన్ల దందా కొనసాగిస్తూ ని యోజకవర్గ అభివృద్ధిని విస్మరించారని ధ్వజమెత్తారు.కేజీ టు పీజీ విద్యావకాశాలు కల్పిస్తున్నట్లు బీఆర్‌ఎస్‌ ప్రగల్బాలు పలుకుతున్నప్పటికీ డోర్నకల్‌ నియోజకవర్గంలో ఒక్క ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కళాశాల లేకపోవడం రెడ్యా పనితీరుకు అద్దం పడుతోందన్నారు. ఈ ప్రాంత లంబాడీ బిడ్డలు చదువుకుంటే రాజకీయ చైతన్యంతో ప్రశ్నిస్తారని గిరిజనులను చదువుకు దూరం చేసేకుట్ర చేశారన్నారు. నాగార్జునసాగర్‌, కృష్ణనది జలాలు నియోజకవర్గం పక్క నుంచే వెళ్తున్నప్పటికి ఆ జలాలను ఇటు మళ్లించే ప్రయత్నం చేయలేదని విమర్శించారు. జలాలు మళ్లించి ఉంటే పాతికేళ్ల కిందటే డోర్నకల్‌ నియోజకవర్గమంతా సస్యశ్యామలం అయ్యేదన్నారు

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.