
సోషల్ మీడియాలో ఖర్చు బారెడు…
సిరా న్యూస్,హైదరాబాద్; వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్.. జనాలకు ఇదొక నిత్య వ్యవహారం. కానీ, రాజకీయ పార్టీలకు, నేతలకు మాత్రం అవసరాన్ని బట్టి వాడకంగా మారింది. ప్రత్యేకించి ఎన్నికల సమయంలో ఇది వాళ్లకు అత్యంత ప్రాధాన్యమిచ్చే అంశం. 2014 నుంచి సోషల్ మీడియా వినియోగం పెరుగుతూ వస్తోంది. 2018లో ఎన్నికల్లో కీలకపాత్ర పోషించింది. తాజాగా కూడా సోషల్ మీడియా ప్రచారం అభ్యుర్థుల గెలుపోటముల్లో కీలకంగా మారింది. త్వరగతిన ప్రజలకు చేరాలంటే సోషల్ మీడియాను మించిన వేగవంతమైన వేదిక వాళ్లకు మరొకటి కనిపించడం లేదు మరి. అందుకే.. అన్ని మాధ్యమాల్లో ఈసారి ఎన్నడూ లేనంతంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరానికి ఊపు తెచ్చింది సోషల్ మీడియా. దీంతో అన్ని పార్టీలతోపాటు అభ్యర్థులు కూడా సోషల్ మీడియా కోసం భారీగా ఖర్చు చేశారు. సోషల్ మీడియా ప్రచారంలో నేతల ఊకదంపుడు ఉపన్యాసాలుంటేనే…
