Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 9 December 2023, 7:24 pmEditor : Sira News

హామీలు అన్ని అమలు చేస్తాం మల్యాల కరుణాకర్

 

 సిరా న్యూస్ గుడిహత్నూర్

హామీలు అన్ని అమలు చేస్తాం మల్యాల కరుణాకర్

100 రోజుల్లోనే హామీలు అన్ని అమలుచేస్తాం అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్యాల కరుణాకర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మాహా లక్ష్మి పథకం మహిళలకు ఉచిత ప్రయాణం శనివారం గుడిహత్నూర్ మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ లో ప్రారంభమైన  సందర్భంగా గుడిహత్నూర్ బస్టాండ్ లో ప్రయాణికులతో కలిసి  సంబరాలు జరుపుకున్నారు. శ్రీమతి సోనియా గాంధి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక బస్టాండ్ ప్రాంగణంలో మండల కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా చెప్పినట్లుగానే 6 గ్యారంటీల్లో భాగంగా ఈరోజు మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం జరిపించడం శుభ పరిణామం అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ బ్లాక్ అధ్యక్షులు బాలాజీ పటేల్, ఇచ్చోడ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ నాగ్ నాథ్ ,పార్టీ మండల ఉపాధ్యక్షులు అరిఫ్ ఖాన్, ప్రధాన కార్యదర్శలు ఉయాక శ్యామ్ రావు , పవార్ రాజు జిల్లా కార్యదర్శి ఆసిఫ్, మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు కుమ్ర భీర్శబ్ ,మైనారిటీ సెల్ అధ్యక్షులు ఎస్.కె సలీం, మండల యూత్ ప్రెసిడెంట్ పెందుర్ గోవింద్, ఎంపీటీసీ పెందుర్ జైరాం, కార్యదర్శి దొమ్మటి సురేష్, మాజీ ఎంపీటీసీ కొల్లూరు వినోద్,నాయకులు దేవ్ రావు, రవీందర్ ముండే, తదితరులు పాల్గొన్నారు.

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.