
హామీలు అన్ని అమలు చేస్తాం మల్యాల కరుణాకర్
సిరా న్యూస్ గుడిహత్నూర్ హామీలు అన్ని అమలు చేస్తాం మల్యాల కరుణాకర్ 100 రోజుల్లోనే హామీలు అన్ని అమలుచేస్తాం అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్యాల కరుణాకర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మాహా లక్ష్మి పథకం మహిళలకు ఉచిత ప్రయాణం శనివారం గుడిహత్నూర్ మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ లో ప్రారంభమైన సందర్భంగా గుడిహత్నూర్ బస్టాండ్ లో ప్రయాణికులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. శ్రీమతి సోనియా గాంధి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక బస్టాండ్ ప్రాంగణంలో మండల కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా చెప్పినట్లుగానే 6 గ్యారంటీల్లో భాగంగా ఈరోజు మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం జరిపించడం శుభ పరిణామం…
