ఆంధ్రప్రదేశ్

శ్రీశైలంలో తెరుచుకున్న 10 గేట్లు..

నాగార్జునసాగర్‌ దిశగా 2.79 లక్షల క్యూసెక్కులు.. నేడు ఖరీఫ్‌ కోసం ఎడమ కాల్వకు నీరు విడుదల సిరా న్యూస్,శ్రీశైలం; కృష్ణమ్మ జలసిరులకు ప్రాజెక్టులు కళకళలాడుతున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టును నిండు కుండలా చేసిన గంగమ్మ తల్లి నాగార్జునసాగర్‌ వైపు బిరబిరా పరుగులిడుతోంది. కృష్ణవేణి ప్రవాహ ధాటికి శ్రీశైలం గేట్లు మరిన్ని తెరుచుకున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టులో మూడు గేట్ల ద్వారా నీటిని విడుదల చేయగా.. మంగళవారం పది గేట్ల ద్వారా 2.79 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 4.13 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. ప్రస్తుతం నాగార్జునసాగర్‌లో 144.22 టీఎంసీల నీరు ఉంది. కృష్ణమ్మ ప్రవాహం ధాటికి సాగర్‌లో నీటి మట్టం ఒక్కరోజులోనే ఆరు అడుగులు పెరిగింది. ఈ ప్రవాహ ఉధృతి మరో 10 రోజులు ఇలాగే కొనసాగితే నాగార్జునసాగర్‌ నిండుకుండలా మారనుంది.…

Read More
1 Aug 2024, 4:28 pmsiranews.in