తాజా వార్తలు

Bhole Baba : 100 కోట్ల భోలే బాబా

సిరా న్యూస్,న్యూడిల్లీ; యూపీలోని హాథ్రస్ జిల్లాలో జూలై 2న భోలే బాబా నిర్వహించిన సత్సంగ్ లో జరిగిన తొక్కిసలాటలో 121 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం విధితమే. ఇంకా అనేకమంది తీవ్రగాయాల పాలై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల కుటుంబాలు ఇప్పటికీ గుండెలవిసేలా రోధిస్తున్నాయి. తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్న పిల్లలు, పిల్లల్ని పోగొట్టుకున్న తల్లిదండ్రులు.. అనాధలుగా మిగిలారు. తాజాగా బాధిత కుటుంబాలను కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ పరామర్శించారు. ఈ ఘటనపై జ్యుడీషియల్ విచారణ జరుగుతున్నదని సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు.అయితే.. ఘోర దుర్ఘటనకు కారణమైన భోలే బాలా అలియాస్ సూరజ్ పాల్ సింగ్ అలియాస్ నారాయణ్ సాకార్ ఎక్కడున్నాడో ఇంతవరకూ పోలీసులకు తెలియలేదు. భోలే బాబా ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు ఘటనకు బాధ్యుల్ని చేస్తూ.. ఆరుగురిని అరెస్ట్ చేశారు. తాజాగా భోలే బాబా…

Read More
6 Jul 2024, 11:16 amsiranews.in