
117 జీవో రద్దు చేయాలి
- యుటిఎఫ్ సిరా న్యూస్,బద్వేలు; రాష్ట్రంలో అమలు జరిపిన 117 జీవో ఫలితంగా రాష్ట్ర విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని, ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల విశ్వాసం సడలిపోతున్నదని దీని వలన ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమైపోతున్నాయని పరిస్థితులు విషమించకముందే ప్రభుత్వం మేల్కొని 117 జీవో రద్దు చేయాలని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మి రాజా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలెం మహేష్ బాబు కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డిని కోరారు.రాష్ట్ర సంఘం పిలుపుమేరకు విద్యారంగ సమస్యల పరిష్కారం కొరకు కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి నివాసంలో ఆమెను కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ మేనేజ్మెంట్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలు సుదీర్ఘకాలంగా ఆపరిష్కృతంగా వున్నాయని,పెరిగిన పనిభారంతో బాటు సమస్యలు పరిష్కారంకాక ఉపాధ్యాయుల అసంతృప్తి తీవ్రస్థాయిలో ఉన్నదని క్రింది సమస్యలన్నిటికి తగిన పరిష్కారం చూపే…
