
12 మంది ఆశావహులు “ఒక్క చాన్స్ ప్లీజ్
సిరా న్యూస్,ఖమ్మం; రాజకీయ అనుభవజ్ఞులతో పాటు అసలు రాజకీయం తెలియని వ్యక్తులు సైతం కాంగ్రెస్ ఎంపీ టిక్కెట్ కోసం అర్రులు చాస్తున్నారు. ఇప్పటికే అధిష్టానం వద్ద దరఖాస్తుల గడువు ముగిసే నాటికి ఖమ్మం స్థానం నుంచి పోటీచేసేందుకు 12 మంది ఆశావహులు "ఒక్క చాన్స్ ప్లీజ్.." అంటూ దరఖాస్తు చేసుకున్నారు.ఖమ్మం నుంచి గతంలో పోటీ చేసి కేంద్ర మంత్రి పదవిని అలంకరించిన మాజీ మంత్రి రేణుకా చౌదరి, డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగంధర్ తో పాటు అసలు రాజకీయఅనుభవమే లేని బడా వ్యాపార వేత్త వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ కూడా దరఖాస్తు చేసుకున్నారు.రాష్ట్ర కాంగ్రెస్లో సీనియర్ నేత వి.హనుమంతరావు సైతం ఖమ్మం…
