
12 ఏళ్లు … 550 కిలోలు తగ్గాడు
సిరా న్యూస్,దుబాయ్; ఉండాల్సిన దానికంటే అధికంగా ఉంటే అది ఏదైనా ప్రమాదమే. అందుకే ఏదైనా మితంగా ఉండాలని పెద్దలంటుంటారు. అయితే ఇతడి విషయంలో ఆ పదం తప్పిపోయింది. ఫలితంగా ప్రపంచంలోనే అత్యంత బరువైన వ్యక్తిగా అతడు పేరు పొందాల్సి వచ్చింది. ఏకంగా 610 కిలోల భారీ శరీరంతో ప్రపంచంలోనే అత్యంత బరువు ఉన్న వ్యక్తిగా అతడు రికార్డ్ సృష్టించాడు. అంతటి బరువు ఉండడంతో ఆరోగ్యం అత్యంత విషమంగా ఉండేది. మూడు సంవత్సరాలు పాటు అతడు మంచానికే పరిమితం అయ్యాడు. విపరీతమైన బరువు వల్ల కనీసం తన వ్యక్తిగత పనులు కూడా చేసుకోలేకపోయేవాడు. ప్రతి చిన్న పనికి కూడా కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల మీద ఆధారపడేవాడు. అయితే అతని దుస్థితిపై మీడియాలో విపరీతమైన కథనాలు ప్రసారమయ్యాయి. ఆ విషయం సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా చెవికి చేరింది.…
