
2025 ఎన్నికల నామ సంవత్సరమే…
సిరా న్యూస్,హైదరాబాద్; గ్రామాల్లో పాలన పడకేసి పది నెలలు తొమ్మది నెలలు కావొస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలకు 2019 జనవరిలో ఎన్నికలు జరిగాయి. కొత్త పంచాయతీల పాలకవర్గాలన్నీ అదే ఏడాది ఫిబ్రవరిలో కొలువు దీరాయి. ఈ ఏడాది ఫిబవరిలో గ్రామ పంచాయతీల పాలక వర్గాలు పదవుల నుంచి దిగిపోగా పంచాయతీల బాగోగులు పట్టించుకునేందుకు ప్రత్యేక అధికారులను నియమించారు.పాత పాలక వర్గాల పదవీ కాలం పూర్తయ్యాక ఎన్నికలు నిర్విహించాల్సిన స్థానే వివిధ కారణాలతో ప్రభుత్వం ఎన్నికలను వాయిదా వేస్తూ వచ్చింది. ఈ కారణంగానే గ్రామాలను స్పెషల్ అధికారుల చేతిలో పెట్టింది. వాస్తవానికి ఈ పాటికే ఎన్నికలు జరుగుతాయని అంతా భావించారు, రిజర్వేషన్ల ఖరారు విషయంలో నెలకొన్న సందిగ్ధం వల్ల విషయం కొలిక్కి రావడం లేదు.రిజర్వేషన్లు ఖరారు చేయాలంటే కుల గణన పూర్తి కావాల్సి ఉంది. కులాల జనాభా…
