
రూ,,36,000 వేల కోట్లను దిగమింగిన రాష్ట్ర ప్రభుత్వం
- పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్ సిరా న్యూస్,ఏలూరు; ఏలూరు జిల్లా, ఉంగుటూరు నియోజకవర్గం, చేబ్రోలు గ్రామపంచాయతీ లో సర్పంచ్ రాందే లక్ష్మి సునీత అధ్యక్షతన జరిగిన గ్రామసభలో పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. స్థానిక గ్రామస్తుల సమస్యలు తెలుసుకుని "గ్రామ వికాస పత్రాన్ని" రూపొందించారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం - వైయస్సార్సీపి నాయకుల ఉపాధి హామీ పథకంగా జగన్మోహన్ రెడ్డి మార్చి వేశాడని అన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కేంద్రం పంపిన రూ,,36,000 వేల కోట్ల నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించి తన సొంత అవసరాలకు వాడుకుంది. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం క్రింద వచ్చిన 36000 వేలకోట్లు - వైయస్సార్సీపి…
