Telugu Online News Daily
https://siranews.in/
https://siranews.in/
Date of Publish : 18 December 2023, 4:30 pmEditor : Sira News
భక్తి శ్రద్ధలతో సుబ్రహ్మణ్యస్వామికి పూజలు..

సిరా న్యూస్,గొల్లప్రోలు:
భక్తి శ్రద్ధలతో సుబ్రహ్మణ్యస్వామికి పూజలు..
గొల్లప్రోలు మండలం దుర్గాడ శివాలయంలో సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా సోమవారం సుబ్రహ్మణ్యేశ్వరుడికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు చెరుకూరి వీరబాబు, దత్తు, వేకువ జామున తీర్థపు బిందితో తీసుకుని వచ్చిన గంగా జలాలతో అభిషేకాలు , సర్పసూక్తంతో పారాయణం, స్వామికి నూతన వస్త్రాలతో వివిధ రకాల పుష్ప మాలికలతో అలంకరణ, నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లును పర్యవేక్షించారు.
