
నెలకు ఆరు కోట్లా…
సిరా న్యూస్,విజయవాడ; వై నాట్ 175 అంటూ ఊదరగొట్టి 11 సీట్లకే పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసుకున్నారు వైఎస్ జగన్. అధికారంలో ఉండగా పిల్లి పాలు తాగినట్లు తమని ఎవరూ పట్టించుకోవడం లేదు కదా అని కొందరు రాజకీయ నాయకులు ప్రవర్తిస్తుంటారు. అత్యధిక మెజారిటీతో అధికారాన్ని చేపట్టిన చంద్రబాబు అండ్ కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం లో జరిగిన అవకతవకలపై విచారణ మొదలెట్టాయి. జగన్ అవినీతి ఆరోపణలన్నీ ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నాయి. ఇప్పటికే కొందరు మాజీ మంత్రులపై కేసులు నమోదయ్యాయి. ఇంకా మరికొందరు లైన్ లో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని కూడా లెక్క చేయకుండా విలాసాలకు ఖర్చుపెట్టేశారు గత పాలకులు. ఏపీలో అందినకాడికి అప్పులు చేసి ఖజానా ఖాళీ చేశారు. కొత్తగా వచ్చిన చంద్రబాబు సర్కార్ ఈ ఆర్థిక లోటును ఎలా…
