
అవయవదానం చేసిన గజ్జల పావనీ లత కుమార్తె కు సిఎం రిలీఫ్ ఫండ్ కింద 6 లక్షల ఆర్థిక సహాయం
గజ్జల పావనీ లత కుమార్తె జ్యోత్స్న , తాతయ్య వీర ప్రతాప్ రెడ్డి కి చెక్ అందించిన మంత్రి బుగ్గన సిరా న్యూస్,కర్నూలు; ఈ ఏడాది ఫిబ్రవరి 5 తేదీన కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి లో బ్రెయిన్ డెడ్ గా డిక్లేర్ చేయబడిన గజ్జల పావనీ లత అవయవాలను వారి కుటుంబ సభ్యులు దానం చేసిన విషయం తెలిసిందే.. తల్లి దండ్రులు ఇద్దరినీ కోల్పోయిన గజ్జల పావనీ లత కుమార్తె జ్యోత్స్న కు ఆర్థిక సహాయం అందించాల్సిందిగా వారి కుటుంబ సభ్యులు జిల్లా కలెక్టర్ గారికి విన్నవించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిఎం రిలీఫ్ ఫండ్ కింద 6 లక్షల ఆర్థిక సహాయం చేశారు.. గురువారం కలెక్టరేట్ లో గజ్జల పావనీ లత కుమార్తె జ్యోత్స్న , గార్డియన్ అయిన తాతయ్య వీర ప్రతాప్ రెడ్డి…
