తాజా వార్తలు

ఆచూకి దొరకని 623 మంది మహిళలు

 సిరా న్యూస్,న్యూఢిల్లీ; ఆంధ్రప్రదేశ్‌లో 2019-23 మ‌ధ్య అదృశ్యమైన 44,685 మంది మ‌హిళ‌ల్లో 44,022 మందిని పోలీసులు వెతికి ప‌ట్టుకున్నార‌ని కేంద్ర స‌హాయ మంత్రి బండి సంజ‌య్ పార్లమెంట్‌లో ప్రకటించారు. ఈ విషయంలో కేంద్ర హోంశాఖ రాష్ట్ర పోలీస్ శాఖ‌కు స‌హాయ‌ప‌డింద‌ని టీడీపీ ఎంపీలు బీకే పార్థ‌సారథి, లావు శ్రీకృష్ణ దేవ‌రాయ‌లు అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానంగా చెప్పారు. మ‌హిళ‌ల‌పై వేధింపులు, చిన్నారుల‌పై అఘాయిత్యాలు త‌దిత‌ర చ‌ర్య‌ల నుంచి కాపాడేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వంతో క‌లిసి `విముక్తి` కార్య‌క్ర‌మం నిర్వ‌హించిన‌ట్టు మంత్రి బండి సంజ‌య్ వివ‌రించారు. మాన‌వ అక్ర‌మ రవాణాను నివారించ‌డంలోనూ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు హోం మంత్రిత్వ శాఖ ఆర్థిక సాయం చేసిన‌ట్టు బండి చెప్పారు. దీని కోసం ప్ర‌తి జిల్లాలో యాంటీ ట్రాఫికింగ్ యూనిట్ల‌ను నెలకొల్పామ‌న్నారు. నాలుగేళ్ల‌లో అదృశ్యమై, మళ్లీ గుర్తించిన వారి వివ‌రాలు.. సంవత్సరం అదృశ్యమైనవారి…

Read More
31 Jul 2024, 6:29 pmsiranews.in