
జగన్ భద్రత కోసం 90 కోట్లా….
సిరా న్యూస్,విజయవాడ; గతం మాదిరిగా తనకు భద్రత కల్పించాలని మాజీ సీఎం జగన్ కోరుతున్నారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. గత ఐదేళ్లుగా ఆయనకు అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండేది. కానీ ఏపీ ఎన్నికల్లో ఓటమి తర్వాత సీన్ మారింది. జగన్ కు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో ప్రోటోకాల్ ప్రకారం భద్రతను తగ్గించింది. అయితే రాజకీయ దురుద్దేశంతోనే తనకు భద్రత తగ్గించారని జగన్ వాపోయారు. పలుమార్లు బాహటంగానే ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరుణంలో తాజాగా ఆయన భద్రతను పెంచేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు. దీంతో ఇది హాట్ టాపిక్ గా మారింది. జగన్ భద్రతపై చర్చ నడుస్తోంది. అసలు జగన్ కు ఎంత మంది భద్రత కల్పించేవారు? దాని కయ్యే ఖర్చు ఎంత? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అధికార, ప్రతిపక్ష…
