
సొంత చెల్లెలిని చంపేసిన అన్న
సిరా న్యూస్,కర్ణాటక; ఇతర మతానికి చెందిన యువకుడిని ప్రేమించిందన్న అక్కసుతో సొంత చెల్లెలినే కడతేర్చాడో అన్న. దీంతో కోపోధ్రిక్తుడైన అన్న చెల్లిని చెరువులోకి తోచి చంపేందుకు యత్నించాడు. గమనించిన తల్లి బిడ్డను కాపాడుకునేందుకు తాను కూడా చెరువులోకి దూకింది. ఈక్రమంలో తల్లీకూతుళ్లు మృత్యువాత పడ్డారు. ఈ దారుణ సంఘటన కర్ణాటకలోని మైసూరు జిల్లా హుణసూరు తాలూకా మరూరు గ్రామంలో జరిగింది.మైసూరు జిల్లా హుణసూరు తాలూకా మరూరు గ్రామానికి చెందిన సతీశ్, అనిత(43) దంపతులకు ఇద్దరు సంతానం. కుమారుడు నితిన్, ధను శ్రీ. నితిన్ కూలి పనులకు వెళ్తుండగా.. ధను శ్రీ(19) బీకాం రెండో సంవత్సరం చదువుతోంది. ఈక్రమంలో మారూరుకు పొరుగున ఉన్న హనగోడు గ్రామానికి చెందిన ఇతర మతస్తుడైన ఓయువకుడిని ధనుశ్రీ ప్రేమిస్తోంది. తాజాగా బుర్ఖా ధరించి ప్రేమించిన వ్యక్తితో రోడ్డుపై కనిపించింది. దీంతో నితిన్ తరుచూ…
