తాజా వార్తలు

లక్సెట్టిపేటలో బలం నిరూపించుకున్న గులాబీ

సిరా న్యూస్,అదిలాబాద్; మంచిర్యాల జిల్లాలో లక్షేట్టిపేట మున్సిపాలిటీని తమ చేతుల్లోంచి జారిపోకుండా ఎట్టకేలకు కాపాడుకోగలిగింది బీఆర్ఎస్. లక్షేట్టిపేట మున్సిపాలిటీలో 15 వార్డ్‌లుండగా.. 9 మంది కాంగ్రెస్ కౌన్సిలర్ల బలంతో చైర్మన్ నలుమాసు కాంతయ్య, వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్‌లపై అవిశ్వాసానికి‌ గత నెల 12న నోటీసులు ఇవ్వగా.. ఫిబ్రవరి 3న బల నిరూపణకు అవకాశం ఇచ్చారు జిల్లా‌ కలెక్టర్. ఆయన ఆదేశాలతో ప్రత్యేక‌ అధికారి మంచిర్యాల ఆర్డీవో రాములు ఆధ్వర్యంలో బల నిరూపణ సమావేశం జరిగింది. ఉదయం 11 గంటలకు చైర్మన్‌పై అవిశ్వాస బలనిరూపణ, మధ్యాహ్నం 12.30 గంటలకు వైస్ చైర్మన్‌పై అవిశ్వాస బలనిరూపణకు అవకాశం ఉండగా.. కోరం సభ్యులు ఎవరు హాజరు కాకపోవడంతో ప్రొసిడింగ్ అధికారి రాములు సమావేశాన్ని 3:30 గంటలకు మార్చారు. అయినప్పటికి కోరం సభ్యులు‌ ఎవరు హాజరుకాకపోవడంతో చైర్మన్, వైస్ చైర్మన్‌లపై…

Read More
5 Feb 2024, 3:13 pmsiranews.in