తాజా వార్తలు

భగభగ మండుతున్న భూగోళం

సిరా న్యూస్; భూగోళం భగభగ మండిపోతోంది. చరిత్రలోనే ఎన్నడూ లేని గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇది ఎక్కడో సహారా ఎడారిలోనో.. మరే ఉష్ణమండల ప్రాంతంలోనో కాదు.. యావత్ భూగోళమే అధిక ఉష్ణోగ్రతలతో సతమతమవుతోంది. తాజాగా కొద్ది రోజుల క్రితం ముగిసిన ఏప్రిల్ నెల చరిత్రలోనే అత్యంత గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన నెలల్లో ఒకటిగా రికార్డుల్లోకెక్కింది. గత 11 నెలలుగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి నెల రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని, రానున్న రోజుల్లో ఇలాంటి విపత్తులు మరిన్ని ఎదుర్కోక తప్పదని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. యూరోపియన్ యూనియన్ వాతావరణ విభాగం “కోపర్నికస్ క్లైమెట్ ఛేంజ్ సర్వీస్ (C3S)” ప్రకారం భూగోళంపై అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన నెలగా ఏప్రిల్ నిలిచింది. ఈ సంస్థ అంచనాల ప్రకారం 2023 కంటే 2024 మరింత వేడి…

Read More
9 May 2024, 11:53 am
Updated: 9 May 2024, 11:54 am
siranews.in