
పవన్ చెవిలో కమలం పువ్వు
సిరా న్యూస్,విజయవాడ; అవును... ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఎక్కడ విన్నా ఇదే చర్చ. అసలు బలం లేని బీజేపీ మాత్రం పట్టుబట్టి పది అసెంబ్లీ స్థానాలను దక్కించుకుంది. ఆరు పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి సిద్ధమైంది. బెట్టు చేసి మరీ పంతాన్ని నెగ్గించుకుంది. అవసరం ఇద్దరికీ ఉంది. కానీ ఎక్కువ అసవరం తమ కన్నా మీకే అన్న సంకేతాలను భారతీయ జనతా పార్టీ నాయకత్వం బలంగా పంపగలిగింది. కానీ బీజేపీ కంటే బలముండి.. పవన్ అండ అవసరం ఎక్కువగా ఉన్నప్పుటికీ జనసేనాని మాత్రం తెలుగుదేశం పార్టీకి లొంగిపోయాడన్న విమర్శలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. బీజేపీకి ఉన్న దూర దృష్టి కూడా పవన్ కల్యాణ్ కు లేకపోవడం తమ దురదృష్టమంటూ జనసైనికులు తలలు పట్టుకుంటున్నారు.నిజానికి ఈ ఎన్నికలు టీడీపీకి చావో రేవో. అతి ముఖ్యమైన ఎన్నికల్లో పవన్ కల్యాణ్…
