తాజా వార్తలు

కదులుతున్న నీట్ డొంక

సిరా న్యూస్,పాట్నా; నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) యూజీ 2024 పరీక్షలో అక్రమాలు తవ్వేకొద్దీ బయటపడుతున్నాయి. బిహార్‌లో ఈ పరీక్ష ప్రశ్నపత్రం లీకైనట్లు వచ్చిన వార్తలను గతవారం కేంద్ర విద్యాశాక, నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ తోసిపుచ్చింది. లీకేజీకి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని ఆరోపణలు కొట్టిపారేసింది. ప్రతి పక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నట్లు ఆరోపించాయి. అయితే, పేపర్‌ లీక్‌ నిజమేనని ఆధారాలతో సహా బయటికొచ్చింది. పరీక్ష ముందురోజు రాత్రే నీట్‌ ప్రశ్నపత్రం జవాబులతో సహా తమకు అందిందని బిహార్‌లో అరెస్టయిన నలుగురు పోలీసులకు వెల్లడించారు. ఈ వ్యవహారం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం లేపుతోంది.బీహార్‌లో అరెస్టయిన నలుగురు విద్యార్ధుల్లో అభిలాషి అనురాగ్ యాదవ్, అతని మామ దానాపూర్ మున్సిపల్ కౌన్సిల్‌లో జూనియర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న సికందర్‌తో పాటు మరో…

Read More
22 Jun 2024, 12:40 pmsiranews.in