తాజా వార్తలు

రేవంత్ కు అరుదైన గౌరవం…

 సిరా న్యూస్,హైదరాబాద్; తెలంగాణలో పదేళ్ల తర్వాత కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. సీఎంగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలతోపాటు పలు హామీలను అమలు చేసేందుకు రేవంత్‌ సర్కార్‌ చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అందిస్తున్నారు. తాజాగా రైతు రుణమాఫీ చేస్తున్నారు. ఇప్పటికే రూ.1.50 లక్షల వరకు రుణాలు మాఫీ చేశారు. ఆగస్టు 15 నాటికి రూ.2 లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించారు. మరోవైపు ఇటీవలే 2024-25 సంవత్సరానికి సంబంధించిన పూర్తి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అసెంబ్లీ సమావేశాలు ఆగస్టు 2న ముగిశాయి. ఈ క్రమంలో తెలంగాణలోకి పెట్టుబడులను ఆహ్వానించేందుకు ఆగస్టు 3న సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లారు. అగ్రరాజ్యంలో సీఎంకు అడుగడుగునా…

Read More
7 Aug 2024, 2:38 pmsiranews.in