తాజా వార్తలు

ఆ ఆరింటిపై గులాబీ గురి

 సిరా న్యూస్,హైదరాబాద్; పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది బీఆర్ఎస్ పార్టీ. 17 ఎంపీ సీట్లలో ఆరు స్థానాలపై మాత్రం గులాబీ పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. గులాబీ పార్టీని వీడి జాతీయ పార్టీల నుంచి పోటీ చేస్తున్న నేతల నియోజకవర్గాలను బీఆర్ఎస్ టార్గెట్ చేస్తోంది.చేవెళ్ల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న గడ్డం రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా ఉండి కాంగ్రెస్‌లో చేరారు. ఈ ఎన్నికల్లో ఆయన హస్తం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ సెగ్మెంట్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని నేతలతో వరుస సమీక్షలు నిర్వహిస్తూ పార్టీ గెలుపుకోసం వ్యూహాలు రచిస్తున్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డికి చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్‌లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పట్టు ఉండటంతో ఆమెకు ఇంచార్జ్ బాధ్యతలను అప్పగించింది పార్టీ.జహీరాబాద్ ఎంపీగా…

Read More
12 Apr 2024, 5:13 pmsiranews.in