
నీళ్ల ఉద్యమానికి తెర తీస్తున్న గులాబీ
సిరా న్యూస్,నల్గోండ; కృష్ణా జలాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ బీఆర్ఎస్ యుద్ధానికి సిద్ధమవుతోంది. ప్రధానంగా కృష్ణా జలాల అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ కార్యాచరణ రూపొందిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జలాల అంశాన్ని ప్రచారాస్త్రంగా మలుచుకునేందుకు బీఆర్ఎస్ వ్యూహం రచిస్తోంది. కృష్ణా జలాల్లో వాటా తేల్చాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ చలో నల్లగొండకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది.కృష్ణా జలాలతో అత్యధిక లబ్ధి పొందుతున్న ఉమ్మడి నల్లగొండ జిల్లా కేంద్రంగా బీఆర్ఎస్.. రేవంత్ సర్కార్ పై పోరాటానికి సిద్ధమవుతోంది. ఛలో నల్లగొండ పేరుతో ఈనెలలో భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. లక్ష మందితో నల్లగొండలో భారీ బహిరంగ సభను నిర్వహించాలని ఆ పార్టీ భావిస్తోంది. నల్లగొండ భారీ బహిరంగ సభ తర్వాత పార్టీ నేతలు నాగార్జున సాగర్ వరకు పాదయాత్ర నిర్వహించేందుకు…
