తాజా వార్తలు

గ్రేటర్ లో గులాబీకి షాక్…

సిరా న్యూస్,హైదరాబాద్; గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ పరిస్థితి గందరగోళంగా మారింది. తెలంగాణ భవన్ లో ఆ పార్టీ నిర్వహించిన కీలక సమావేశానికి ఐదుగురు ఎమ్మెల్యేలు గైర్హాజర్ అయ్యారు. గ్రేటర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమెపై అవిశ్వాసం పెట్టాలన్న యోచనలో బీఆర్ఎస్ ఉంది. అందుకే కార్పొరేటర్లు ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి రావాలని గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరికీ సమాచారం పంపారు.అయితే ఐదుగురు ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. శేరిలింగం పల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, కుత్పుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద హాజరు కాలేదు. కాలేరు వెంకటేష్, పద్మారావు, ప్రకాష్ గౌడ్ మాత్రమే హాజరయ్యారు. మామూలుగా అయితే ఈ సమాశం కేటీఆర్ ఆధ్వర్యంలో జరుగుతోందని…

Read More
6 Jul 2024, 1:26 pmsiranews.in