
మూసీపై తలో మాట….
సిరా న్యూస్,హైదరాబాద్; ‘‘హైదరాబాద్‌లో 28వేల అక్రమ కట్టడాలు ఉన్నాయి. ఇకపై కొత్త వాటికి ఛాన్స్ లేదు. అన్నింటినీ కూల్చివేయాల్సిందే’’.. సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇవి. నగరానికి వరదలు వచ్చిన సమయంలో, అక్రమ కట్టడాల వల్లే కాలనీలు నీట మునిగిన సందర్భంలో కేసీఆర్ ఈ కామెంట్స్ చేశారు. ట్విస్ట్ ఏంటంటే, కేసీఆర్ వ్యాఖ్యలకు విరుద్ధంగా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ వ్యవహరిస్తోంది. తండ్రి ఒక మాట, కుమారుడు మరో బాటలో వెళ్తుండడంతో, కేడర్‌ను కన్‌ఫ్యూజ్‌లోకి నెడుతోంది. మూసీ ప్రక్షాళనకు సిద్ధమైన ప్రభుత్వం, అక్రమ కట్టడాల కూల్చివేతకు రెడీ అయింది. నిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చింది. నదిని సర్వాంగ సుందరంగా తయారు చేసేందుకు ప్లాన్ చేసింది. అయితే, బుధవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫతేనగర్‌లో నిర్మాణం పూర్తి చేసుకున్న ఎస్‌టీపీని సందర్శించారు.…
